భారతదేశం, ఆగస్టు 3 -- ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ఒక మైలురాయిగా నిలవాల్సిన శుభ సందర్భం.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన కొన్ని వీడియోల వల్ల తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చేలా నిర్మించిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం రోజే అక్కడ చోటుచేసుకున్న ఘటనలు నెటిజన్లను, రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేశాయి.

ఆగస్టు 1, 2026న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా వైభవంగా ప్రారంభమైన భోగాపురం విమానాశ్రయంలో, ఆగస్టు 17, 2026 నుండి వాణిజ్య విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. అయితే ప్రారంభోత్సవం ముగిసిన వెంటనే విమానాశ్రయాన్ని సందర్శించేందుకు వచ్చిన ప్రజలు ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వైరల్ అయిన వీడియో దృశ్యాల ప్రకారం... విమానాశ్రయాన్ని చూడటానికి వచ్చ...