భారతదేశం, జనవరి 3 -- సినీ పరిశ్రమలో అక్షయ్ ఖన్నాకు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. కానీ 2025 ను మాత్రం అక్షయ్ ఖన్నా సంవత్సరం అని పిలవడం అతిశయోక్తి కాదు. 2025లో ఈ నటుడు ఛావా, ధురంధర్ రెండు చిత్రాలలో విలన్ గా నటించాడు. ఆ చిత్రాలు ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాలుగా నిలిచాయి. విమర్శకుల ప్రశంసలతో పాటు, అక్షయ్ ఒక గొప్ప ప్రజాదరణ మైలురాయిని కూడా అధిగమించాడు.

ఒక ఏడాది (365 రోజుల) వ్యవధిలో బాక్సాఫీస్ దగ్గర రూ.2 వేల కోట్లు వసూలు చేసిన రెండో నటుడిగా అక్షయ్ ఖన్నా నిలిచాడు. అతను ఈ ఏడాది కాలంలో నటించిన రెండు సినిమాలు.. ఛావా, ధురంధర్ బాక్సాఫీస్ మోత మోగించాయి. ఇది రెండు కలిపి కలెక్షన్లు రూ.2000 కోట్లు దాటాయి. దీంతో అరుదైన రికార్డు అక్షయ్ ఖన్నా ఖాతాలో చేరింది.

లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వంలో విక్కీ కౌశల్ హీరోగా నటించిన 'ఛావా' చిత్రంలో మొఘల్ చక్రవర్...