భారతదేశం, ఫిబ్రవరి 21 -- పాన్ ఇండియా లెవల్‌లో ఈ ఏడాది సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' (Toxic) ఒకటి. శుక్రవారం (ఫిబ్రవరి 20) విడుదలైన టాక్సిక్ సినిమా టీజర్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తోంది.

రాకీ భాయ్ యశ్ మరోసారి తన వయోలెంట్ యాక్షన్ అవతార్‌తో శత్రువుల అరాచకాన్ని ఊచకోత కోస్తూ కనిపించారు. యశ్ ఇంటెన్స్ లుక్ చూసి అభిమానులు మురిసిపోతుంటే, మరోవైపు నెటిజన్లు మాత్రం ఒక కీలక విషయాన్ని ప్రశ్నిస్తున్నారు.

అయితే, టాక్సిక్ సినిమాలో కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హ్యూమా ఖురేషీ వంటి బిగ్గెస్ట్ హీరోయిన్స్ ఉన్న సంగతి తెలిసిందే. కానీ. టాక్సిక్ టీజర్‌లో మాత్రం వీరిలో ఏ ఒక్కరు కూడా కనిపించకపోవడం ప్రస్తుతం చర్చకు దారితీసింది.

"సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉన్నారు, కానీ, టీజర్...