భారతదేశం, జనవరి 26 -- ప్రకాష్ రాజ్ బాలీవుడ్, సౌత్ సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ రెండు ఇండస్ట్రీల మధ్య తేడా ఏంటో కుండబద్ధలు కొట్టినట్లు చెప్పాడు. హిందీ సినిమా తన మూలాలను పూర్తిగా కోల్పోయిందని, అది రోజురోజుకూ "నకిలీ"గా, కేవలం "డబ్బు సంపాదనే ధ్యేయంగా" మారిపోతోందని అతనడం గమనార్హం. ప్రస్తుతం జరుగుతున్న తొమ్మిదవ కేరళ సాహిత్య ఉత్సవంలో (కేఎల్ఎఫ్) మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ హిందీ సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

వార్తా సంస్థ పీటీఐ రిపోర్టు ప్రకారం ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. "ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే.. మలయాళం, తమిళ సినిమా పరిశ్రమలు చాలా బలమైన సినిమాలను రూపొందిస్తున్నాయని నాకు అనిపిస్తోంది. కానీ మరోవైపు హిందీ సినిమా తన అస్తిత్వాన్ని, మూలాలను కోల్పోయింది. అక్కడ ప్రతిదీ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో బొమ్మల్లాగా చాలా అందంగా,...