భారతదేశం, ఆగస్టు 18 -- Siddipet Serial Murder Cases : సిద్దిపేట జిల్లాలో సంచలనం సృష్టించిన వరుస హత్యలు, దోపిడీల కేసులను పోలీసులు ఛేదించారు. పక్కా ప్రణాళికతో ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ.. బంగారం, నగదు కోసం దారుణాలకు ఒడిగడుతున్న తల్లి, ఆమె మైనర్ కుమారుడిని అరెస్ట్ చేసినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూంపల్లి గ్రామానికి చెందిన దూబ్బయ్య, భార్య చకాలి రజిత (38)ను అరెస్టు చేసి జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించగా.. ఆమె మైనర్ కొడుకును జువైనల్ హోమ్‌కు పంపించినట్లు సీపీ తెలిపారు.

ఈ నెల ఆగస్టు 8న రామక్కపేట శివార్లలోని వ్యవసాయ పొలాల్లో సగం కాలిన స్థితిలో ఒక అనాథ మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ కేసును సవాలుగా తీసుకుని విచారణ చేపట్టిన పోలీసులకు, మృతురాలు భూంపల్లి గ్రామానికి...