భారతదేశం, డిసెంబర్ 16 -- ఇటీవల ఆస్ట్రేలియా సిడ్నీలోని బోండి బీచ్‌లో యూదులు హనుక్కా ఉత్సవం చేసుకుంటుండగా ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఇద్దరు వ్యక్తులు కాల్పులు చేశారు. ఈ ఘటనలో 15 మంది మరణించారు. ఉగ్రవాదులలో ఒకరైన సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌ టోలిచౌకికి చెందినవాడని అధికారులు గుర్తించారు. మరో వ్యక్తి అతడి కుమారుడు, ఆస్ట్రేలియా పౌరుడైన నవీద్ అక్రమ్. అయితే హైదరాబాద్‌లో అతని కుటుంబంతో సంబంధాలు తక్కువగా ఉన్నాయని పోలీసులు తెలిపారు.

సాజిద్ అక్రమ్ తీవ్రవాద మనస్తత్వం, కార్యకలాపాల గురించి లేదా అతని తీవ్రవాదానికి ఆకర్శితుడు అవ్వడానికి దారితీసిన పరిస్థితుల గురించి కుటుంబ సభ్యులు తమకు తెలియదని చెప్పారని తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. సాజిద్ అక్రమ్, అతని కుమారుడు 24 ఏళ్ల నవీద్ అక్రమ్ ఈ దాడికి పాల్పడ్డారు. 15 మందిని చంపి, అనేక మందిని గాయప...