భారతదేశం, జనవరి 20 -- ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు అందుకున్న మాజీ మంత్రి హరీశ్ రావును సిట్ అధికారులు విచారణ చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సుమారు ఏడు గంటలపాటు హరీశ్ రావును అధికారులు ప్రశ్నించారు. ఏసీపీ వెంకటగిరి, ఎస్పీ రవీందర్ రెడ్డి విచారణలో పాల్గొన్నారు. సిట్ విచారణ అనంతరం బయటకి వచ్చి అభిమానులకు అభివాదం చేశారు హరీశ్ రావు. ఆ తర్వాత తెలంగాణ భవన్‌కి బయలు దేరి వెళ్లారు.

తెలంగాణ భవన్‌లో హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. నైతిక మద్దతు ఇచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలిపారు.

రేవంత్ రెడ్డి ఇచ్చిన సిట్ నోటీసు అంతా ఒక ట్రాష్ అని హరీశ్ రావు అన్నారు. నిరాధార ఆరోపణలు, అడిగిందే అడుగడం, సొల్లు పురాణం అని వ్యాఖ్యానించారు. అధికారులక...