భారతదేశం, జనవరి 1 -- ముంబై/న్యూఢిల్లీ: కొత్త ఏడాది తొలిరోజే సిగరెట్ ప్రియులకు, ఇన్వెస్టర్లకు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. సిగరెట్లపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించడంతో స్టాక్ మార్కెట్లో పొగాకు కంపెనీల షేర్లు కుప్పకూలాయి. గురువారం నాటి ట్రేడింగ్‌లో ప్రముఖ దిగ్గజం ఐటీసీ (ITC) షేర్లు ఏడాది కనిష్ట స్థాయికి పడిపోగా, గాడ్‌ఫ్రే ఫిలిప్స్ (Godfrey Phillips) ఇన్వెస్టర్ల సంపద భారీగా ఆవిరైంది.

కేంద్రం తీసుకున్న నిర్ణయం ఐటీసీ షేర్లపై తీవ్ర ప్రభావం చూపింది. బిఎస్ఈ (BSE)లో ఐటీసీ షేరు సుమారు 6 శాతం మేర నష్టపోయి రూ. 379 వద్ద 52 వారాల కనిష్ట స్థాయిని తాకింది. దీనికి తోడు కంపెనీలో జరిగిన భారీ బ్లాక్ డీల్ (దాదాపు 4.03 కోట్ల షేర్లు) కూడా అమ్మకాల ఒత్తిడిని పెంచింది. మరోవైపు, గాడ్‌ఫ్రే ఫిలిప్స్ షేర్లు మరింత దారుణంగా 10 శాత...