సికింద్రాబాద్ - లాలాగూడ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం..!
భారతదేశం, సెప్టెంబర్ 14 -- సికింద్రాబాద్ - లాలాగూడ రైల్వే స్టేషన్ల మధ్య ఓవర్హెడ్ ఎలక్ట్రికల్ ఈక్విప్మెంట్ (OHE) సాంకేతిక సమస్యతో హఠాత్తుగా నిలిచిపోవడంతో రైళ్ల రాకపోకలకు కొంతసేపు విఘాతం కలిగింది. ఆదివారం రాత్రి 10:38 గంటల సమయంలో విద్యుత్ సరఫరాలో సాంకేతిక లోపం తలెత్తినట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు వెల్లడించారు.
ఘటన సమాచారం అందుకున్న వెంటనే రైల్వే సాంకేతిక సిబ్బంది హుటాహుటిన రెస్క్యూ పనుల్లోకి దిగి, విద్యుత్ లైన్ల పునరుద్ధరణ పర్యవేక్షణ చేపట్టారు. సిబ్బంది వేగంగా స్పందించడంతో ప్రధాన మార్గంలో రైళ్ల సేవలు సజావుగా పునరుద్ధరించారు. ప్రస్తుతం అప్ , డౌన్ లైన్లలో రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు.
ఓవర్ హెడ్ విద్యుత్ తీగలు ట్రిప్ అవ్వడం వల్ల ఈ మార్గంలో ప్రయాణించే కొన్ని రైళ్లు దాదాపు 10 నిమిషాల కంటే తక్కువ సమయం పాటు మార...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.