భారతదేశం, అక్టోబర్ 4 -- సికింద్రాబాద్ నగరంలో డెలివరీ ఏజెంట్లపై వరుసగా జరుగుతున్న దాడుల పరంపరలో మరో విచారకర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఫుడ్ డెలివరీ కొన్ని నిమిషాలు ఆలస్యమైందనే సన్నకారణంతో ఒక డెలివరీ బాయ్‌పై దంపతులు అత్యంత దారుణంగా భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలోని వాసవి నగర్‌లో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఆశిష్ అనే డెలివరీ ఏజెంట్ నిత్యం లాగే కస్టమర్ ఆర్డర్ చేసిన పార్శిల్‌ను అందజేసేందుకు వాసవి నగర్ వెళ్లాడు. అయితే ఆర్డర్ బుక్ చేసే సమయంలో కస్టమర్ యాప్‌లో తప్పు లొకేషన్ నమోదు చేయడంతో, సరైన చిరునామాను వెతుక్కుంటూ ఆశిష్ అక్కడికి చేరుకునేసరికి కొన్ని నిమిషాల ఆలస్యమైంది.

డెలివరీ ఆలస్యాన్ని నిలదీస్తూ ఆ...