భారతదేశం, అక్టోబర్ 22 -- పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ప్రకటన విడుదల చేశారు. సికింద్రాబాద్ - తిరుపతి, విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య నడిచే ఈ ప్రత్యేక రైళ్ల షెడ్యూల్, వేళలు, ఆగే స్టేషన్ల పూర్తి వివరాలు చూడండి.

07424(సికింద్రాబాద్ నుండి తిరుపతి) స్పెషల్ ట్రైన్ అక్టోబర్ 22, 2026 సికింద్రాబాద్‌లో రాత్రి 8 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు శుక్రవారం ఉదయం 11 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు మార్గమధ్యంలో చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలులో 2ఏసీ, 3ఏస...