భారతదేశం, నవంబర్ 20 -- తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడో రోజు బుధవారం రాత్రి సింహ వాహనంపై యోగనరసింహుడి అలంకారంలో అమ్మవారు భక్తులను కటాక్షించారు. సింహం పరాక్రమానికి, శీఘ్రగమనానికి, వాహనశక్తికి ప్రతీక. అమ్మవారికి సింహం వాహనంగా సమకూరిన వేళ దుష్టశిక్షణ, శిష్టరక్షణ అవలీలగా చేస్తుందని నమ్మకం. భగవతి పద్మావతి ఐశ్వర్యం, వీరత్వం , యశస్సు, ప్రభ, జ్ఞానం, వైరాగ్యం అనే ఆరు గుణాలను భక్తులకు ప్రసాదిస్తుందంటారు. వేంకటేశ్వర హృదయేశ్వరిని స్వామితో మమేకమైన శక్తిగా ధ్యానించడం సంప్రదాయం.
ఈ సింహ వాహనసేవలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఆలయ అర్చకులు బాబు స్వామి, అర్చకులు, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.