భారతదేశం, జూన్ 6 -- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింహ రాశి వారికి ఈ వారం కొన్ని హెచ్చుతగ్గులతో కూడి ఉంటుంది. వారం ప్రారంభంలో మానసికంగా కొంత ఆందోళన, టెన్షన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. సమాజంలో గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుందేమోననే అనవసర భయం వేధిస్తుంది. కాబట్టి. నలుగురిలో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.

వారం గడిచేకొద్దీ పరిస్థితుల్లో సానుకూల మార్పులు వస్తాయి. సవాళ్లను అధిగమించి వ్యాపార రంగంలో అద్భుత విజయాన్ని అందుకుంటారు. మొత్తం మీద ఈ వారం మీకు శుభప్రదమైన ఫలితాలనే అందిస్తుంది. శనిదేవుడికి నమస్కరించడం, పూజించడం వల్ల ఈ వారం మరిన్ని మంచి ఫలితాలు సాధించవచ్చు.

వ్యాపార కోణంలో చూస్తే... సింహ రాశి వారికి ఈ వారం ఎంతో అనుకూలంగా ఉంది. మీరు కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి. మార్కెట్‌లో మీ స్థానం మరింత బల...