భారతదేశం, మే 25 -- ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం కీలక నిర్ణయం తీసుకుంది. అప్పన్న ఆలయాన్ని త్వరలోనే పూర్తిగా నగదు రహిత (Fully Cashless) క్షేత్రంగా మార్చేందుకు ఆలయ యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది. భక్తులకు మరింత సులభంగా, వేగంగా సేవలందించేందుకు డిజిటల్ చెల్లింపులను ప్రవేశపెడుతున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.

ఈ మేరకు సోమవారం (మే 25, 2026) దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లెపల్లి వెంకటరావు ఒక ప్రకటన విడుదల చేశారు. క్యూ లైన్లలో వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు దర్శనం, ప్రసాదం, ఆర్జిత సేవల టికెట్ల బుకింగ్‌ను పూర్తిగా డిజిటల్ ఛానళ్ల ద్వారా అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. భక్తులు ఈ డిజిటల్ సేవలను వినియోగించుకుని సులభంగా స్వామివారిని దర్శించుకోవాలని కోరారు.

ఆలయంలో మొబైల్ ...