భారతదేశం, ఆగస్టు 19 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి, రాశి మార్పులకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. నవగ్రహాల కదలికలు మానవ జీవితంపై, వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఈ క్రమంలోనే 2026 ఆగస్టు నెలలో ఒక అరుదైన, శక్తివంతమైన గ్రహాల సంయోగం జరగబోతోంది. గ్రహాల రాజుగా భావించే సూర్యభగవానుడు, నీడ గ్రహమైన కేతువు ఇప్పటికే తమ సొంత రాశి అయిన సింహరాశిలో తిష్ఠ వేశారు. ఇప్పుడు వీరితో పాటు బుధ గ్రహం కూడా తోడు కానుంది.

హిందూ పంచాంగం ప్రకారం, 2026 ఆగస్టు 22వ తేదీ సాయంత్రం 07:33 గంటలకు బుధుడు సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఒకే రాశిలో మూడు గ్రహాలు కలిసినప్పుడు దానిని 'త్రిగ్రహి యోగం' అని పిలుస్తారు. దీనికి తోడు, సూర్యుడు మరియు బుధుడు ఒకే రాశిలో కలిసి ఉండటం వల్ల అత్యంత శుభప్రదమైన 'బుధాదిత్య రాజయోగం' కూడా రూపుదిద్దుకోనుంది. ఈ అరుదైన గ్రహాల కూటమి స...