భారతదేశం, జూలై 6 -- ప్రకృతి ప్రేమికులకు, వారాంతాల్లో సరదాగా గడపాలనుకునే పర్యాటకులకు సరికొత్త ప్రయాణ అనుభూతులను అందించేందుకు IRCTC టూరిజం సిద్ధమైంది. పచ్చని కొండల పకృతి రమణీయతకు నిలయమైన అరకు వ్యాలీని సందర్శించడానికి 'విశాఖపట్నం-అరకు-విశాఖపట్నం' (రైల్ కమ్ రోడ్) పేరిట ఒక రోజు (01 Day) ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ప్రతిరోజూ అందుబాటులో ఉండే ఈ టూర్ ప్యాకేజీ ద్వారా పర్యాటకులు ఎంతో సౌకర్యవంతంగా అరకు అందాలను చూసి రావొచ్చు.

కంఫర్ట్ క్లాస్ (Comfort - EV విస్టాడోమ్ కోచ్) లో ఒక్కరే ప్రయాణిస్తే రూ. 6,545, ఇద్దరు కలిసి ప్రయాణిస్తే ఒకరికి రూ. 4,055, ముగ్గురు కలిసి ప్రయాణిస్తే ఒకరికి రూ. 3,225, నలుగురు కలిసి ప్రయాణిస్తే ఒకరికి రూ. 2,810గా ఉంటుంది.

స్టాండర్డ్ క్లాస్ (Standard - SL స్లీపర్ కోచ్)లో అయితే ఒక్కరే ప్రయాణిస్తే (Single Occupancy) రూ. 5,650...