సింగరేణి ప్రైవేటీకరణకు కుట్ర: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆరోపణలు
భారతదేశం, అక్టోబర్ 15 -- గోదావరిఖని: తెలంగాణ రాష్ట్రానికి మకుటాయమానంగా నిలిచిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)ను ప్రైవేటీకరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. సంస్థ నిర్వహణలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని, వాటన్నింటిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి స్టేడియంలో నిర్వహించిన 'సింగరేణి కార్మిక గర్జన' బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. ఈ ప్రభుత్వ రంగ సంస్థను కాపాడుకోవడానికి కార్మికులందరూ ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. గోదావరిఖనిని పోరాటాల గడ్డగా అభివర్ణించిన ఆయన, దేశ విద్యుత్ రంగానికి, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి సింగరేణి కార్మికులు అందించిన సేవలను కొనియాడారు. ప్రత్యేక రాష్ట్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.