భారతదేశం, నవంబర్ 4 -- సింగరేణి సంస్థలో ఉద్యోగాలు కోల్పోయిన మాజీ కార్మికులకు సంస్థ యాజమాన్యం తీపి కబురు అందించింది. 2023 నుంచి 2025 మధ్య కాలంలో వివిధ కారణాల వల్ల విధులకు గైర్హాజరై, ఉద్యోగాల నుంచి తొలగింపునకు గురైన మాజీ ఉద్యోగుల కేసులను పునఃపరిశీలించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. బాధితులకు మరో అవకాశం కల్పిస్తూ వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు ఒక ప్రత్యేక హైపవర్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

ఇటీవల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కోల్ బెల్ట్ ప్రాంత ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ కారణాలతో ఉద్యోగాలు కోల్పోయిన డిస్మిస్డ్ ఉద్యోగులను మానవీయ కోణంలో తిరిగి విధుల్లోకి తీసుకోవాలని పలువురు ప్రజాప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు.

ప్రజాప్రతినిధుల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన డిప్యూట...