భారతదేశం, నవంబర్ 6 -- Singareni worker regularization : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) కార్మికులకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం తీపి కబురు అందించింది. సుదీర్ఘకాలంగా క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూస్తున్న 1,135 మంది కార్మికుల కల నెరవేరింది. బదిలీ వర్కర్లు, జనరల్ అసిస్టెంట్ ట్రైనీలుగా పనిచేస్తున్న వారిని 'జనరల్ అసిస్టెంట్లు'గా క్రమబద్ధీకరిస్తూ సంస్థ యాజమాన్యం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఇటీవల కోల్ బెల్ట్ ప్రజాప్రతినిధులతో నిర్వహించిన కీలక సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క కార్మికులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. గత రెండు మూడు ఏళ్లుగా ఎదురుచూస్తున్న కార్మికుల సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించిన ఆయన, ఇచ్చిన మాట ప్రకారం యాజమాన్యంతో మాట్లాడి ఈ ప్రక్రియను వేగవంతం చేయించారు.

సింగరేణి ఛైర్మన్, ఎండీ డాక్టర్ బుద్ధ...