భారతదేశం, సెప్టెంబర్ 22 -- దసర పండుగను పురస్కరించుని సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. లాభాల్లో 34 శాతం పంచాలని నిర్ణయించినట్టుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు ఒక్కో కార్మికుడికి బోనస్‌గా రూ.1,95,610 ఇవ్వనున్నట్టుగా వెల్లడించారు. హైదరాబాద్‌లో పలువురు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి మీడియా సమావేశం నిర్వహించారు. సింగరేణి సంస్థ బొగ్గు గని మాత్రమే కాదు.. అది ఒక ఉద్యోగ గని అని భట్టి కొనియాడారు.

కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ చెల్లిస్తామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ ఇవ్వడం దేశ చరిత్రలోనే తొలిసారి అన్నారు. 'సింగరేణి సంస్థలో అన్నిరకాల ఉద్యోగులు కలిసి 71 వేల మంది ఉన్నారు. సంస్థను జాగ్రత్తగా నడుపుతున్న, కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సింగరేణి యాజ...