భారతదేశం, అక్టోబర్ 13 -- బొగ్గు గని కార్మికుల ముఖాల్లో వెలుగులు నింపుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) కార్మికులకు దసరా పండుగ కానుకగా ప్రొఫిట్ షేరింగ్(లాభాల్లో వాటా) బోనస్‌ను ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సాధించిన లాభాల్లో 34 శాతాన్ని కార్మికులకు బోనస్‌గా పంపిణీ చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.

ఈ నిర్ణయంతో సింగరేణిలో పనిచేస్తున్న ప్రతీ పర్మనెంట్ కార్మికుడికి రూ.1,51,912 బోనస్ రూపంలో అందనుంది. గతంతో పోలిస్తే ఇది అత్యధిక బోనస్. కేవలం పర్మనెంట్ ఉద్యోగులకే కాకుండా, కంపెనీ అభివృద్ధిలో భాగస్వాములవుతున్న కాంట్రాక్ట్ కార్మికులకు కూడా దసరా కానుకగా రూ.5,500 బోనస్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పండుగకు ముందే ఈ డబ్బులు కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్న...