సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ఒక్కొక్కరికి రూ.1,10,250 బోనస్
భారతదేశం, అక్టోబర్ 5 -- సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(SCCL) కార్మికులకు దసరా, దీపావళి పండుగల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. అర్హులైన కార్మికులకు ఒక్కొక్కరికి రూ. 1,10,250 చొప్పున భారీ బోనస్ అందించనున్నట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు.
అమావాస్య నీడల్లో, నేల గర్భంలో పగలు-రాత్రి తేడా లేకుండా ప్రాణాలను సైతం పణంగా పెట్టి దేశానికి వెలుగులు నింపుతున్న బొగ్గు గని కార్మికుల కృషి వెలకట్టలేనిదని కిషన్ రెడ్డి అభినందించారు. సింగరేణి అనేది కేవలం వ్యాపార దృక్పథంతో నడిచే బొగ్గు ఉత్పత్తి సంస్థ మాత్రమే కాదని, తెలంగాణ సంస్కృతిలో భాగమైన కొంగు బంగారం అని కొనియాడారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది కుటుంబాలకు జీవనాధారంగా నిలుస్తోందన్నారు.
సి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.