భారతదేశం, అక్టోబర్ 16 -- సింగరేణి సంస్థను నాశనం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని కేటీఆర్ ఆరోపించారు.సింగరేణిని వేదికగా చేసుకుని వేల కోట్ల రూపాయల అవినీతికి తెరలేపిందన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన నర్సంపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణుల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు, విద్యుత్ రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని కేటీఆర్ దుయ్యబట్టారు. "సింగరేణిలో టన్ను బొగ్గు రూ. 3,800లకే లభిస్తుంటే, ఆస్ట్రేలియా వంటి విదేశాల నుంచి టన్నుకు రూ. 10,000 నుండి రూ. 12,000 పెట్టి కొనుగోలు చేయడానికి రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. కేవలం ముడుపులు, కమీషన్లు కొట్టేందుకే ఈ విదేశీ బొగ్గు డ్రామా ఆడుతున్నారు," అని విమర్శిం...