భారతదేశం, జూలై 13 -- తమిళనాడులో అజిత్ కుమార్ అనే సెక్యూరిటీ గార్డు కస్టడీలో మృతిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. తాజాగా ఈ ఘటనపై నిరసన కార్యక్రమం నిర్వహించగా.. తమిళ వెట్రి కళగం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ పాల్గొన్నారు. కస్టడీలో మరణించిన బాధితుడు అజిత్ కుమార్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో టీవీకే కార్యకర్తలు చెన్నైలో గుమిగూడారు. ఈ సందర్భంగా నినాదాలు చేస్తూ కనిపించారు. నిరుపేద కుటుంబానికి చెందిన అజిత్ కుమార్.. కస్టడీలో మృతి చెందడం సంచలనంగా మారింది.

ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పారని, మాకు న్యాయం కావాలని నల్ల చొక్కా ధరించి విజయ్ నిరసన తెలిపారు. మీ హయాంలో కస్టడీలో మరణించిన మరో 24 మంది బాధితుల కుటుంబాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వారికి కూడా క్షమాపణలు చెప్పాలన్నారు. ఆ కుటుం...