భారతదేశం, జూన్ 23 -- ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక ముందడుగు పడింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం మంగళవారం (జూన్ 23) సస్పెండైన కృష్ణ లంక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగరాజును అదుపులోకి తీసుకున్నది. పోలీస్ కస్టడీలో యువకుడిపై తీవ్రస్థాయిలో థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు, ఆ తర్వాత అతడు రహస్యంగా మాయమవ్వడం వెనుక ఉన్న అసలు నిజాలను వెలికితీసేందుకు సిట్ అధికారులు రంగంలోకి దిగారు.

పోలీసుల కథనం, విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సాయికృష్ణ అనే యువకుడిని ఓ కేసు విషయమై విచారించేందుకు కృష్ణ లంక పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అయితే అప్పటి సీఐ నాగరాజు పర్యవేక్షణలో సాయికృష్ణపై కస్టడీ టార్చర్ జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీసుల దెబ్బలు తట్టుకోలేక సాయికృష్ణ లాకప్‌లోనే మరణ...