భారతదేశం, సెప్టెంబర్ 9 -- తెలంగాణ అంతటా ఉల్లిపాయల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. అనేక మార్కెట్లలో మెున్నటి దాకా ముప్పై నలభై పలికిన ధరలు ఒకేసారిగా పెరిగాయి. ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ.60కి నుంచి రూ.80కి మధ్యలో పలుకుతున్నాయి. మరికొన్ని రోజుల్లో సెంచరీకి చేరువ అవుతాయి. కొన్ని రోజుల క్రితం కిలో రూ.40 చొప్పున అమ్ముడైన ఉల్లిపాయల ధరలు ఇప్పుడు మరింత పెరగడంతో, సామాన్యుల ఇంటి బడ్జెట్‌పై భారం పడుతోంది.

మహారాష్ట్రలోని నాసిక్ ప్రధాన ఉల్లి ఉత్పత్తి కేంద్రాలలో ఒకటి, తెలంగాణకు కీలక సరఫరాదారుగా ఉంది. మహారాష్ట్ర నుండి ఉల్లిపాయలు పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల మార్కెట్లకు వస్తుంటాయి. అలాగే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు ప్రాంతం నుండి కూడా తెలంగాణకు ఉల్లిపాయలు సరఫరా అవుతాయి.

కొత్త పంట రావడంలో జాప్యం, ప్రధాన ఉల్లి సాగ...