భారతదేశం, సెప్టెంబర్ 11 -- తెల్ల కాగితాలపై రాసుకున్న భూముల కొనుగోళ్ల ఒప్పందాలు(సాదాబైనామా) క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనితో సుమారు 9 లక్షలకుపైగా రైతులకు ప్రయోజనం కలగనుంది. 12-10-2020 నుంచి 10-11-2020 వరకు దరఖాస్తు చేసుకున్న సాదాబైనామ భూముల క్రమబద్ధీకరణ జరగనుంది.

2020 ఆర్వో చట్టంలో క్రమబద్ధీకరణకు సెక్షన్లు లేకపోవడంతో గతంలో ఈ ప్రక్రియను న్యాయస్థానం నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే సాదాబైనామాల క్రమబద్ధీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుసార్లు ప్రకటనలు చేశారు. న్యాయస్థానంలో ఉన్న వివాద పరిష్కారానికి సంబంధించి చర్యలు తీసుకున్నారు. తాజాగా హైకోర్టు సాదాబైనామా రైతలకు 13-బి ప్రొసీడింగ్స్ జారి చేసేందుకు అనుమతి ఇచ్చింది.

ఈ పథకం కిందట గరిష్టంగా 5 ఎకరాల వరకు కేవలం కాగితాల...