Telangana,hyderabad, ఆగస్టు 22 -- హైదరాబాద్ లోని కూకట్ పల్లి పదేళ్ల బాలిక హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నాలుగు రోజులుగా ఈ కేసును పోలీసులు విచారిస్తుండగా. ఇవాళ చేధించారు. ఈ కేసులో మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను హత్య చేసినట్లు తేల్చారు.

పోలీసుల వివరాల ప్రకారం. సదరు బాలుడు ఆగస్ట్ 18వ తేదీన బాలిక ఇంట్లోకి దొంగతనానికి వెళ్లాడు. అతడిని గమనించిన బాలిక. బాలుడి చొక్కా పట్టుకుని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఆ బాలుడు కోపంతో కత్తితో పొడిచాడు. దీంతో సదరు బాలిక ప్రాణాలు కోల్పోయింది.

ఈ కేసులో ఓ కాగితం కూడా వెలుగులోకి వచ్చింది. దొంగతనానికి ముందుగానే ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. ఇంట్లోకి ఎలా వెళ్లటం నుంచి బయటికి రావటం వరకు కొన్ని విషయాలు రాసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ లేఖ కూడా వైరల్ గా మారింది.

బాలుడు తన నేరాన్ని అంగీ...