భారతదేశం, డిసెంబర్ 30 -- భారత ఆటోమొబైల్​ మార్కెట్​పై పట్టు సాధించేందుకు టాటా మోటార్స్​ అగ్రెసివ్​గా ప్లాన్స్​ వేస్తోంది. ఇందులో భాగంగానే సంస్థ ఇటీవలే విడుదల చేసిన 'టాటా సియెర్రా'.. కేవలం 24 గంటల్లోనే 70వేలకు పైగా ఆర్డర్లు సాధించి సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు తన బెస్ట్​ సెల్లింగ్, ఫ్యామిలీ​ ఎస్​యూవీ 'టాటా పంచ్'కు మిడ్-లైఫ్ ఫేస్​లిఫ్ట్​ ఇచ్చేందుకు సంస్థ సిద్ధమైంది. తాజాగా ఈ మోడల్ ఒకటి భారత రోడ్లపై టెస్ట్​ డ్రైవ్​ చేస్తూ కనిపించింది. ఈ నేపథ్యంలో 2026 టాటా పంచ్​కి సంబంధించి కొన్ని కొత్త విషయాలు బయటకు వచ్చాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

2026 టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​ లాంచ్​ డేట్​ని టాటా మోటార్స్ ఇంకా అధికారికంగా ప్రకటించ లేదు. అయితే, ఈ ఎస్​యూవీ ఈ ఆర్థిక సంవత్సరం చివరిలో, అంటే 2026 మార్చి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

డిజైన్‌లో ...