భారతదేశం, సెప్టెంబర్ 29 -- విజయవాడ దసరా ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. 29వ తేదీన మూలా నక్షత్రం, సరస్వతీ అలంకరణలో అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. మూలా నక్షత్రం పూజలు ప్రారంభమయ్యాయి. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మూలా నక్షత్రం రోజున ముఖ్యమంత్రి.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. మధ్యాహ్నం 3.30 గంటలకు సీఎం చంద్రబాబు పట్టవస్త్రాలు సమర్పించనున్నారు.

మూలా నక్షత్రం కావడంతో భక్తులు భారీగా తరలివస్తారని విజయవాడలో ట్రాఫిక్ మళ్లిస్తున్నట్టుగా పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు తెలిపారు. పున్నమి ఘాట్‌ ఎంట్రన్స్‌, తాడేపల్లి చెక్‌పోస్టు, ఆర్టీసీ ఇన్‌గేట్‌, కనకదుర్గ ఫ్లైఓవర్‌, గద్ద బొమ్మ సెంటర్‌ మీదుగా అమ్మవారి గుడివైపు ద్విచక్రవాహనాలకు అనుమత...