భారతదేశం, జూన్ 10 -- సరికొత్త లోకంలో విహరిస్తూ మైండ్ రిఫ్రెష్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. విలాసవంతమైన నౌక 'కార్డేలియా క్రూయిజ్' (Cordelia Cruise) మళ్లీ పర్యాటకులను అలరించేందుకు సిద్ధమైంది. ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైజాగ్ వేదికగా ఈ సముద్ర విహార యాత్రలు పునఃప్రారంభం కానున్నాయి. పర్యాటకుల కోసం ఈ లగ్జరీ షిప్ ప్రయాణ తేదీలు, ప్యాకేజీలు, టికెట్ ధరల వివరాలు.

ఈ ఏడాది సముద్ర విహార సీజన్ జూన్ 22 నుండి ప్రారంభమై జూలై 15వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ పరిమిత కాలంలో విశాఖపట్నం - చెన్నై మధ్య ఈ భారీ నౌక ప్రయాణిస్తుంది. ఈ సీజన్‌లో వైజాగ్ నుండి చెన్నైకి నాలుగు సార్లు, అలాగే తిరుగు ప్రయాణంలో చెన్నై నుండి వైజాగ్‌కు నాలుగు సార్లు ఈ క్రూయిజ్ నడుస్తుంది. సాధారణంగా ఈ టూర్ ప్యాకేజీలు 3 రాత్రులు - 4 రోజులు (3 Nights / 4 Day...