భారతదేశం, ఆగస్టు 14 -- మహీంద్రా నుంచి అత్యంత ఆదరణ పొందిన స్కార్పియో క్లాసిక్ త్వరలో కొత్త హంగులతో మార్కెట్లోకి రానుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది! తాజాగా బయటకు వచ్చిన డిజిటల్ రెండర్ చిత్రాలు ఇందుకు కారణం. ఈ ఎస్‌యూవీ డిజైన్ ఎలా ఉండబోతుందనే దానిపై అధికారిక లాంచ్ కంటే ముందే ఇంటర్నెట్‌లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త మహీంద్రా స్కార్పియో క్లాసిక్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఫేస్​లిఫ్ట్​కి సంబంధించిన కొత్త రెండర్ చిత్రాలను పరిశీలిస్తే, ముందు భాగంలో గ్రిల్‌ను పూర్తిగా మార్చేశారు! ప్రస్తుతం ఉన్న నిలువు స్లాట్ డిజైన్‌కు బదులుగా హనీకాంబ్ లేదా మెష్ ప్యాటర్న్‌ను పొందుపరిచారు. బంపర్‌ను కూడా కొత్తగా డిజైన్ చేసి, కింద వైపు పెద్దదైన సిల్వర్ కలర్ ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌ను అమర్చారు. ఎస్​య...