భారతదేశం, ఆగస్టు 26 -- సచిన్ టెండూల్కర్.. ఈ పేరు వినగానే క్రికెట్లో ఆయన నెలకొల్పిన రికార్డులు, సాధించిన ఘనతలు గుర్తుకొస్తాయి. క్రికెట్ ను మతంగా భావించే ఇండియాలో దేవుడిగా ఎదిగాడు సచిన్. ఆటకు ఎప్పుడో రిటైర్మెంట్ ఇచ్చినా సచిన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ లెజెండరీ ఆటగాడు ఇప్పుడు ఖాళీ టైమ్ దొరికితే సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తారు. రీసెంట్ ఓ తమిళ సినిమా తనకెంతో నచ్చిందని సచిన్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

సచిన్ టెండూల్కర్ కు నచ్చిన తమిళ ఫ్యామిలీ డ్రామా '3బీహెచ్‌కే'. హీరో సిద్ధార్థ్, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఆడియన్స్ మనసుకు హత్తుకుంది. థియేటర్లలో అదరగొట్టింది. మంచి వసూళ్లు సాధించడంతో పాటు మనసులు గెలుచుకుంది. తండ్రి కల నెరవేర్చేందుకు సొంత ఇల్లు కోసం పాటు పడే కొడుకు కథగా 3బీహెచ్‌కే ఈ ఏడాది జులై 2025లో రిలీజైంది.

రీసెంట్ గా రెడి...