భారతదేశం, జూలై 9 -- మానవత్వానికే మచ్చ తెచ్చేలా, నమ్మిన స్నేహితులే ఒక వ్యక్తిని డబ్బు కోసం చంపేశారు. ఈ ఘోరమైన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. శాస్త్రీయ ఆధారాలు, సాంకేతిక పరిజ్ఞానం, అంతర్రాష్ట్ర పోలీసుల సమన్వయంతో అనంతపురం జిల్లా డి.హిరేహాళ్ మండలం పులకుర్తి గ్రామంలో జరిగిన ఈ కిరాతక హత్య కేసును జిల్లా పోలీసులు ఛేదించారు.

జూన్ 23న పులకుర్తి సమీపంలోని వ్యవసాయ పొలాల్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పూర్తిగా కాలిపోయిన స్థితిలో కనిపించింది. అసలు ఎలాంటి సాక్ష్యాలు కూడా ఈ కేసులో పోలీసులకు కనిపించలేదు. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న అనంతపురం ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు రాయదుర్గం రూరల్ ఇన్‌స్పెక్టర్ వెంకటరమణ నేతృత్వంలో ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది.

ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఆధారాలు సేకరించేందుకు వెళ్లింది. కానీ అక్కడ దొరికింది మాత్రం కే...