భారతదేశం, ఫిబ్రవరి 12 -- సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. ఈ సినిమాతో శ్రేయాసి సేన్ హీరోయిన్‌గా పరిచయం అవుతుంది. హర్ష చెముడు, సుప్రియా ఐసోలా మరో జంటగా నటించారు.

పీవోవీ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం నిర్మించారు. నిలవే సినిమా ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా బుధవారం (ఫిబ్రవరి 11) నాడు మాదాపూర్‌లో నిలవే ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లోనే నిలవ ట్రైలర్‌ను సింగర్ సునీత విడుదల చేశారు. ఈ సందర్భంగా నిలవే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సింగర్ సునీత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

సింగర్ సునీత మాట్లాడుతూ.. "ఈ మధ్య చాలా తక్కువ సినిమాల్లో చ...