భారతదేశం, ఏప్రిల్ 4 -- సంసారంలో కలతలు, భార్యాభర్తల మధ్య విభేదాలు అత్యంత సహజమని, కేవలం ఈ కారణాల వల్ల జీవిత భాగస్వామి ఆత్మహత్య చేసుకుంటే దానికి అవతలి వారిదే బాధ్యత అని చెప్పలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. భర్త ఆత్మహత్యకు ప్రేరేపించిందనే ఆరోపణలతో ఓ మహిళపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది.

బాంబే హైకోర్టుకు చెందిన నాగ్‌పూర్ బెంచ్ ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వైవాహిక జీవితంలో గొడవలు రావడం సర్వసాధారణమని, కేవలం మనస్పర్థలు ఉన్నంత మాత్రాన భార్యాభర్తల్లో ఒకరి ఆత్మహత్యకు మరొకరిని బాధ్యులను చేయలేమని జస్టిస్ ఊర్మిళా జోషి ఫాల్కే నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం పేర్కొంది. ఆత్మహత్యకు బలవంతం చేయడం లేదా నేరుగా ప్రేరేపించడం వంటివి ఉంటేనే అది నేరం అవుతుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

"ఇలాంటి కేసుల్లో ఒకరి వేధింపుల వల్లే మరొకరు ఆత్మహత్య చ...