భారతదేశం, జూలై 26 -- కిమ్స్ ఫెర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్, హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంతానలేమి చికిత్సలో జరుగుతున్న ఆధునిక అభివృద్ధి, సమయానికి చికిత్స తీసుకోవడం ప్రాముఖ్యతపై వైద్య నిపుణులు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా డా. నిమ్మ పూజా రెడ్డి, కన్సల్టెంట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ లాపరోస్కోపిక్ సర్జన్ మాట్లాడారు. ఆధునిక ఐవీఎఫ్ సాంకేతికతలతో విజయవంతమైన గర్భధారణ అవకాశాలు గణనీయంగా పెరిగాయని తెలిపారు. సంతానలేమి సమస్యలను ఎదుర్కొంటున్న దంపతులు ఆలస్యం చేయకుండా నిపుణులను సంప్రదిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని సూచించారు.

డా. బి. సింధూర, ఫెర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ రీప్రొడక్టివ్ రీజెనరేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్, పునరుత్పత్తి వైద్యం, రీజెనరేటివ్ ...