భారతదేశం, అక్టోబర్ 23 -- తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పారిశ్రామిక ప్రాంతంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని సరాకా లాబొరేటరీస్ లిమిటెడ్ ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

మృతులను సుదర్శన్ రావు (27), బాలాజీగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారిగా సమాచారం లభించింది.

సరాకా లాబొరేటరీస్ ఫార్మా యూనిట్‌లో శుక్రవారం తెల్లవారుజామున విధులు నిర్వహిస్తుండగా హఠాత్తుగా ప్రమాదకరమైన వాయువు లీకైంది. విషవాయువు పీల్చడంతో ఊపిరాడక ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గ్యాస్ లీకేజీకి గల కచ్చితమై...