భారతదేశం, డిసెంబర్ 30 -- దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి పండుగ దృష్ట్యా పలు ప్రత్యేక రైళ్లను ఇప్పటికే ప్రకటించింది. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య ఇప్పటికే అనేక రైళ్లను సంక్రాంతి పండగ సందర్భంగా నడిపేందుకు సిద్ధమైంది. తాజాగా మరో 11 స్పెషల్ ట్రైన్లను సౌత్ సెంట్రల్ రైల్వే అనౌన్స్ చేసింది.

జనవరి 7వ తేదీ నుంచి 12వ తేదీ మధ్యలో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. సంక్రాంతి ఏపీకి వెళ్లి తిరిగి రావాలి అనుకునేవారికి ఈ ట్రైన్లు ఎంతగానో ఉపయోగకరంగా ఉండనున్నాయి. కాకినాడ-వికారాబాద్, వికారాబాద్-పార్వతీపురం, పార్వతీపురం-వికారాబాద్, పార్వతీపురం-కాకినాడ టౌన్, సికింద్రాబాద్-పార్వతీపురం, కాకినాడ టౌన్-వికారాబాద్ మధ్య ఈ రైళ్లు నడుస్తాయని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.

ఈ ప్రత్యేక రైళ్లలో 1ఏసీ, 2ఏసీ, 3ఏసీ, స్లీపర్‌ కోచ్‌లతో పాటు సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు కూడా ఉంటాయని దక్ష...