భారతదేశం, సెప్టెంబర్ 25 -- బుధవారం స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు నష్టాలను చవిచూశాయి. బ్యాంకింగ్, ఆటో, క్యాపిటల్ గూడ్స్ రంగాలలో లాభాల స్వీకరణతో పాటు విదేశీ నిధులు వెనక్కి వెళ్ళిపోవడం మార్కెట్‌పై ప్రభావం చూపింది. సెన్సెక్స్ 386.47 పాయింట్లు పడిపోయి 81,715.63 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 50 కూడా 112.60 పాయింట్ల నష్టంతో 25,056.90 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ 50 షార్ట్ టర్మ్‌లో బేరిష్ ట్రెండ్‌ను సూచిస్తూ, గంటల చార్టులో 21 EMA (ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్) స్థాయిని నిలబెట్టుకోలేకపోయిందని ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ రూపక్ డే వివరించారు. నిఫ్టీ 50 ప్రతిసారి ఈ 21 EMA దగ్గరకు వచ్చినప్పుడు అమ్మకాల ఒత్తిడి పెరుగుతోంది.

అయితే, 25,000-25,050 స్థాయిలు నిఫ్టీకి కీలక మద్దతుగా (సపోర్ట్) నిలిచే అవకాశం ఉంది. ఒకవేళ ఈ స్థాయిని దాటి...