భారతదేశం, అక్టోబర్ 30 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సముద్ర రవాణా, పారిశ్రామిక ప్రగతిలో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది. విస్తారమైన తీరప్రాంతం, లోతైన నౌకాశ్రయాలు, అందుబాటులో ఉన్న వేల ఎకరాల భూములను ఆసరాగా చేసుకుని రాష్ట్రాన్ని గ్లోబల్ షిప్‌బిల్డింగ్ (నౌకా నిర్మాణం), రిపేర్ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అందుకోసం దక్షిణ కొరియా, జపాన్‌కు చెందిన అంతర్జాతీయ షిప్‌బిల్డింగ్ సంస్థలతో విస్తృత చర్చలు జరుపుతోంది.

రాష్ట్రవ్యాప్తంగా గ్రీన్‌ఫీల్డ్ ఓడరేవుల వద్ద నౌకా నిర్మాణం, మరమ్మతుల కోసం ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేయాలని రవాణా, రోడ్లు-భవనాలు, నియామకాలు, మౌలిక వసతుల శాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు.

"కాకినాడ కేంద్రంగా ఓ అంతర్జాతీయ యాంకర్ సంస్థ భాగస్వామ్యంతో భారీ షిప్‌బిల్డింగ్ క్లస్టర్‌ను తీసుకురావాలని చూస్తున్నా...