భారతదేశం, ఫిబ్రవరి 23 -- టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 90వ దశకంలోనే ఆయన స్టార్‌డమ్ మొదలైనా, 2012లో వచ్చిన 'గబ్బర్ సింగ్' సినిమా ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది.

హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అయితే ఆ సినిమా తర్వాత పవన్ కల్యాణ్‌కు జాతీయ స్థాయిలో భారీ ఆఫర్లు వచ్చాయన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. తాజాగా ఫిబ్రవరి 22న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

"పవన్ కల్యాణ్ డబ్బుకు లొంగే వ్యక్తి కాదు. ఇది నా వ్యక్తిగత అనుభవం. గబ్బర్ సింగ్ త...