భారతదేశం, జూలై 13 -- తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన షాబాద్ వరుస హత్యల నిందితుడు ఎట్టకేలకు శవమై కనిపించాడు. మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా.. వరుసగా ఆరుగురిని పొట్టనబెట్టుకున్న సైకో కిల్లర్ ఎరకలి రాజ్‌కుమార్ (32) మరణించాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పంజర్ల గ్రామం సరిహద్దుల్లో ఉన్న ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌లో రాజ్‌కుమార్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

పంజర్ల గ్రామ సరిహద్దుల్లో ఉన్న ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌లో ఒక వ్యక్తి మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. ఆ మృతదేహం గత కొన్ని రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎరకలి రాజ్‌కుమార్‌దేనని ధృవీకరించుకున్నారు. స్థానికులు వెంటనే సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు...