భారతదేశం, అక్టోబర్ 27 -- అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్ (నిధుల కొరతతో ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోవడం) 26వ రోజుకు చేరుకుంది. దీని ప్రభావం విమాన ప్రయాణాలపై తీవ్రంగా పడింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల కొరత కారణంగా ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 8,000కు పైగా విమానాలు ఆలస్యం అయ్యాయి.

ప్రస్తుతం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది విధులకు దూరంగా ఉండటం వల్ల విమాన ప్రయాణాలకు అంతరాయం కలుగుతోంది. రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ విమానాలు ఆలస్యం కావడం లేదా రద్దయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

అమెరికా రవాణా శాఖ కార్యదర్శి సీన్ డఫీ మాట్లాడుతూ, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) నివేదిక ప్రకారం శనివారం నాడు ఏకంగా 22 ప్రాంతాలలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది కొరత సమస్యలు ఉన్నాయని తెలిపారు. అక్టోబర్ 1న షట్‌డౌన్ ప్రారంభమైన తర్వాత ఇంత పెద్ద స...