భారతదేశం, అక్టోబర్ 16 -- శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెనుకొండ మండలం పరిధిలోని గొల్లపల్లి జలాశయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి ఐదుగురు మహిళలు దారుణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర శోకాన్ని నింపింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... దర్గాపేటకు చెందిన గాయత్రి (50), ఆమె కుమార్తె అశ్విని, వారి ఇరుగుపొరుగు స్నేహితులు పుష్ప, హసీనా, మహిన్‌తో కలిసి శుక్రవారం సరదాగా గొల్లపల్లి జలాశయాన్ని చూడటానికి వెళ్లారు. మధ్యాహ్నం వేళ డ్యామ్ వద్ద అందరూ కలిసి భోజనాలు పూర్తి చేసుకున్నారు. అనంతరం సరదాగా గడిపేందుకు జలాశయం నీటిలోకి దిగారు. అయితే నీటి లోతును సరిగ్గా అంచనా వేయలేకపోవడంతో ఒక్కసారిగా లోతుల్లోకి జారిపోయి మునిగిపోయారు.

విషయం తెలుసుకున్న స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే హుటాహుటిన అక్కడికి చేరుకుని గా...