శ్రీసిటీలో ఘోర ప్రమాదం. బాయిలర్ పేలి మంటలు, పలువురు మృతి..!
భారతదేశం, అక్టోబర్ 3 -- తిరుపతి జిల్లాలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన శ్రీసిటీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి ఇక్కడి ఓ ప్రైవేట్ ఫార్మా పరిశ్రమలో ఉన్నట్టుండి భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే పలువురు కార్మికులు చనిపోయినట్లు సమాచారం.
శ్రీసిటీలోని 'టిల్ హెల్త్ కేర్' పరిశ్రమలో శుక్రవారం రాత్రి కార్మికులు ఎప్పటిలాగే తమ నైట్ షిఫ్ట్ విధుల్లో ఉన్నారు. అయితే, అర్థరాత్రి సమయంలో ఉన్నపళంగా ప్లాంట్‌లోని బాయిలర్/రియాక్టర్ విభాగంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. పేలుడు దాటికి ప్లాంట్ ఆవరణ తీవ్రంగా దెబ్బతింది. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ప్రమాదంలో చిక్కుకుపోయారు.
ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర రెస్క్యూ టీమ్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.