శ్రీశైలానికి కృష్ణమ్మ పరవళ్లు - గేట్లు ఎత్తే అవకాశం ఉందా..? తాజా పరిస్థితి ఇలా
భారతదేశం, ఆగస్టు 8 -- Krishna River Flood Updates : తెలుగు రాష్ట్రాల జీవనాడి కృష్ణమ్మ మళ్లీ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి నిలకడగా వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం జలాశయం నిండు కుండను తలపిస్తోంది. రోజురోజుకూ ఇన్ ఫ్లో గణనీయంగా పెరుగుతుండటంతో ప్రాజెక్టు పరిధిలో సర్వత్రా జలకళ తొణికిసలాడుతోంది.
శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, తాజాగా అందిన అధికారిక సమాచారం(ఆగస్ట్ 8, ఉదయం 9.30 గంటల రిపోర్ట్) ప్రకారం నీటి నిల్వ ఇప్పటికే 155.265 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 873.199 అడుగుల వద్ద కొనసాగుతోంది.
ఎగువ ప్రాజెక్టుల నుంచి ప్రస్తుతం శ్రీశైలానికి ఏకంగా 2,02,355 క్యూసెక్కుల మేర భారీ ఇన్ ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు దిగువ ప్రాంతాలకు 8,70...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.