భారతదేశం, నవంబర్ 26 -- పవిత్ర కార్తీకమాసం సందర్భంగా తిరుమలలోని గోగర్భం సమీపంలో ఉన్న పార్వేట మండపంలో నవంబరు 29వ తేదీన కార్తీక వనభోజన కార్యక్రమం జరుగనుంది. కార్తీకమాసంలో వనభోజనాలు నిర్వహించడం ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం. ఈ ఆధ్యాత్మిక వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపుతారు.

ఈ ఉత్సవంలో భాగంగా నవంబరు 29న ఉదయం 8.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు చిన్న గజవాహనంపై ఆలయం నుంచి బయలుదేరుతారు. శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు పల్లకిపై కొలువై ఉంటారు. ఊరేగింపుగా వీరంతా పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు.

అనంతరం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ వేడుకలో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు వంటి సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి విశేషంగా అభిషేకం చేస్తారు. తర్వాత మధ్యాహ...