శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. హుండీ కానుకలు రూ.28.94 కోట్లు, 33 లక్షల లడ్డూల విక్రయం
భారతదేశం, సెప్టెంబర్ 23 -- శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అర్చక స్వాములు, అధికారులు, ఉద్యోగులు, జిల్లా, పోలీసు యంత్రాంగం, శ్రీవారి సేవకులు, మీడియా ప్రతినిధులు, భక్తుల సమిష్టి కృషితో విజయవంతంగా నిర్వహించామని టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు తెలిపారు. బుధవారం తిరుమల అన్నమయ్య భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రతో కలిసి చైర్మన్ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముఖ్యాంశాలను వివరించారు.
సెప్టెంబరు 15 నుంచి 22వ తేదీ వరకు ఎనిమిది రోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ప్రపంచం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులకు వాహనసేవలతో పాటు శ్రీవారి మూలమూర్తి దర్శనం కల్పించినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల మొదటి రోజైన సెప్టెంబరు 15న రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారని,...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.