భారతదేశం, మార్చి 27 -- ప్రతి సంవత్సరం చైత్ర మాసం శుద్ధ నవమి నాడు శ్రీరామనవమిని జరుపుకుంటాము. శ్రీరామనవమి అనేది రాముడు జన్మించిన రోజు. రాముడు విష్ణుమూర్తి అవతారం. శ్రీరాముడు న్యాయం, ధర్మం, సత్యం, ప్రేమలకు ప్రతిరూపం. శ్రీరాముని ఆదర్శ పురుషుడిగా ఆరాధిస్తాము. అలాగే, శ్రీరామనవమి నాడు ఉపవాసం ఉండి రాముడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఊర్లలో ఉండే రామాలయాలు అన్నీ కూడా ప్రత్యేక పూజలతో భక్తులతో కళకళ్ళాడతాయి.

శ్రీరామనవమి నాడు శ్రీరామ కథను చదువుతారు. శ్రీరామనవమి నాడు రాముల వారి కళ్యాణాన్ని కూడా అంగరంగ వైభవంగా జరుపుతారు. ఈరోజు ప్రత్యేకించి రాముడికి వడపప్పు నైవేద్యంగా పెడతారు. అయితే, రాముడికి ఎందుకు శ్రీరామనవమి నాడు వడపప్పు, పానకాన్ని నైవేద్యంగా పెట్టాలి? దాని వెనుక రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రాముడు సూర్యవంశానికి చెందిన వాడు. శ్రీరామనవమి పండుగ సమయ...